
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. అయితే పాన్ ఇండియా క్రేజ్ కి తగినట్టుగా స్క్రిప్ట్ ను మార్చడానికి కొరటాల కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడనేది వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ వారు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా కొంతమంది పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఆ జాబితాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు కూడా ఉంది. ఇప్పటికే పలు మార్లు జాన్వీ ఎంట్రీ గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వార్తను కూడా నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు.
తాజాగా ఈ సినిమాకి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.













