వకీల్‌ సాబ్‌లో జాన్వీ!!


టాలీవుడ్ పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే, త్వరలోనే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబోతున్నారని సమాచారం. ఒకవేళ అనుమతులు ఇస్తే వకీల్ సాబ్ సినిమాను వెంటనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.

హిందీలో సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు తో పాటుగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా తెలుగులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అయితే.. సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇస్తే మంచి ఇమేజ్‌ ఉంటుందిని జాన్వీని ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ఇది ఎంత వరుకు నిజమో వేచి చూడాలి మరీ..