HomeTelugu Trending'ఎన్టీఆర్ 30'లో జాన్వీ.. ఫోటో షూట్ కాంప్లీట్!

‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ.. ఫోటో షూట్ కాంప్లీట్!

Janhvi look test for NTR30

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్‌ చేస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30 ‘. ఈ సినిమా అప్డేట్‌ గురించి ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి, ప్రముఖ నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ దాదాపు ఫిక్స్‌ అయినట్లు అంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది జాన్వీ. అక్కడ సత్తా చాటుతున్న అమ్మడు సౌత్ సినిమాలతో కూడా పాపులర్ అవ్వాలని చూస్తుంది. అందుకే తారక్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఫిక్స్ చేసుకుంది. ఈ క్రమంలో ‘ఎన్టీఆర్ 30’  నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

NTR30 1

ఈ సినిమాలో జాన్వీ పాత్రకు సంబంధించిన ఫోటో షూట్‌ కూడా నిర్వహించారట దర్శకుడు కొరటాల శివ. అనుకున్న విధంగానే ఆమె లుక్ టెస్ట్ సూపర్ గా వచ్చిందంట. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఫిక్స్‌ అంటున్నారు. ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.  ఎన్టీఆర్ 30 ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. వారు కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని తెలుస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా కాబట్టి దర్శకుడికి ముందుగానే జాగ్రత్తలు చెప్పాడంట తారక్. ఈ సినిమా నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 2024 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌తో రామ్‌ చరణ్‌ డాన్స్‌.. వైరల్‌

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu