HomeTelugu Trendingజానీ మాస్టర్ హీరోగా‌ సినిమా ప్రారంభం

జానీ మాస్టర్ హీరోగా‌ సినిమా ప్రారంభం

Jani master movie launched

డాన్స్‌ మాస్టర్‌ ‘జానీ’ హీరోగా సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే వెంకటరమణ నిర్మిస్తున్న సినిమా ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి షాట్‌కు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. మెగా బ్రదర్‌ నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్బంగా.. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మాట్లాడుతూ “జానీ మాస్టర్‌తో నటించడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ బ్రిల్లియెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు నా నిర్మాత, దర్శకులు, రచయితలకు ధన్యవాదాలు” అని అన్నారు.

హీరో జానీ మాస్టర్ మాట్లాడుతూ “హీరోగా ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు చెప్పలేను. నాకు కొరియోగ్రఫి, దర్శకత్వం అంటే ఇష్టం. డైరెక్టర్‌కు కూడా అదే విషయాన్ని చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు షూటింగ్ లేనప్పుడు టీవీ షూటింగ్‌లకు వెళ్తాను. ఇప్పుడు కొరియోగ్రఫి విషయంలో విరామం దొరికితే సినిమా షూటింగుకు వెళ్తాను. నీవు చేయకపోతే సినిమా చేయనని నిర్మాత వెంకటరమణ చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పక్కన నటించడానికి ముందుకొచ్చిన దిగంగనకు థ్యాంక్స్’’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu