HomeTelugu Reviewsరివ్యూ: జనతా గ్యారేజ్

రివ్యూ: జనతా గ్యారేజ్

jg

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్య మీనన్, దేవయాని, సురేష్, ఉన్ని
ముకుందన్, సాయి కుమార్ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫి: తిర్రు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాతలు: నవీన్, రవి శంకర్, సి.వి.మోహన్
రచన-దర్శకత్వం: కొరటాల శివ
రచయితగా కెరీర్ మొదలుపెట్టి మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారాడు కొరటాల శివ. ఆ తరువాత
శ్రీమంతుడు అనే మరో చిత్రాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు
ఎన్టీఆర్ హీరోగా ‘జనతాగ్యారేజ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో
చిత్రాల తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. మరి
ఈ సినిమా డైరెక్టర్ కు, హీరోకు హ్యాట్రిక్ హిట్ తెచ్చిందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
సత్యం(మోహన్ లాల్) వూర్లో ఉంటూ గ్యారేజ్ నడుపుతూ తమ్ముడిని చదివిస్తాడు. అన్నను
సిటీకు తీసురావాలని భావించి ఆ విషయం చెప్పగానే తమ్ముడు కోసం సిటీలోనే ఉంటూ
‘జనతాగ్యారేజ్’ను నిర్మించి పని చేసుకుంటూ ఉండేవాడు. ఎదుటివారు కష్టంలో ఉంటే చూసి
తట్టుకోలేని సత్యం ఓ అన్యాయాన్ని ఎదిరిస్తాడు. అప్పటినుండి ఎవరికి ఏ కష్టం వచ్చినా..
జనతాగ్యారేజ్ నే ఆశ్రయించేవారు. సత్యం చేసే మంచి పనులు కారణంగా ముఖేష్(సచిన్ ఖేడ్కర్)
అనే వ్యాపారవేత్త సత్యం తమ్ముడుని, అతడి భార్యను చంపిస్తాడు. దీంతో వాళ్ళ కొడుకు
ఆనంద్(ఎన్టీఆర్)ను చిన్నతనంలోనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించి దూరంగా
తీసుకువెళ్లి పెంచమని చెబుతారు. ఆనంద్ కు నేచర్ అంటే చాలా ఇష్టం. ప్రకృతికి
వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా.. ఎదిరిస్తూ ఉంటాడు. ఒక పనిపై హైదరాబాద్ కు వచ్చిన
ఆనంద్, సత్యం కొడుకు రాఘవ(ఉన్ని ముకుందన్)తో గొడవ పడతాడు. దీంతో ఆనంద్ ను
గ్యారేజ్ కు పిలిపించి మాట్లాడతాడు సత్యం. ఇంతకీ సత్యం, ఆనంద్ తో ఏం మాట్లాడారు..?
ఆనంద్ వారి ఇంటి బిడ్డే అని సత్యంకు తెలిసిందా..? ఆనంద్ కూడా గ్యారేజ్ లో భాగమవుతాడా..?
సమంత, నిత్యమీనన్ ఆ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? అనే అంశాలతో సినిమా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫి
మ్యూజిక్
ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్
మైనస్ పాయింట్స్:
సాగతీత
ఎడిటింగ్
విశ్లేషణ:
మొక్కలను ప్రేమించే వారు ఒకరైతే, మనుషులను ప్రేమించే వారు మరొకరు. వీరిద్దరు
కలిస్తే ఎలా ఉంటుందో చక్కగా ప్రెజంట్ చేశారు కొరటాల శివ. సినిమా మొదటి భాగం కొన్ని
యాక్షన్ సీన్స్, పాటలతో స్లో గా నడిచినప్పటికీ ఇంటెర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు
ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్, మోహన్ లాల్ తో చెప్పే డైలాగ్స్ అన్ని వర్గాల ఆడియన్స్ ను
మెప్పిస్తాయి. ఎన్టీఆర్ గ్యారేజ్ లో అడుగుపెట్టే సన్నివేశాలు, అన్యాయాలను ఎదిరించే
సన్నివేశాలు మాస్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అవుతాయి. రాజేవ్ కనకాల సినిమాలో
ఒక సీన్ లో మాత్రమే కనిపించినా.. ఆ పాత్ర సినిమాలో ఒక హైలైట్ గా నిలిచింది. దేవి అందించిన
ప్రతి పాట వినడానికి, చూడడానికి బావున్నాయి. ‘నీ సెలవడిగి..’ అనే ట్రాజడీ మెలోడీ సాంగ్
కంటతడి పెట్టించడం ఖాయం. తిర్రు ఫోటోగ్రఫ్రీ ప్లస్ అయింది. ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది.
సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే ఔట్ పుట్ ఇంకా బావుండేది. సమంత, నిత్య లకు
పెద్ద రోల్స్ లేకపోయినా.. ఉన్నంతలో ఓకే అనిపించారు. కాజల్ ఐటెమ్ సాంగ్ లో అదరగొట్టేసింది.
మొత్తానికి గ్యారేజీకు వసూళ్లు రావడం పక్కా.
రేటింగ్: 2.75/3

Recent Articles English

Gallery

Recent Articles Telugu