జనవరిలో సెట్స్ పైకి మహేష్, కొరటాల సినిమా!

చేసినవి మూడు సినిమాలే అయినా.. మూడు హిట్స్ కావడంతో స్టార్ దర్శకుల లిస్టులోకి
చేరిపోయాడు కొరటాల శివ. గతంలో మహేష్ తో చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా బ్లాక్ బాస్టర్
హిట్ గా నిలిచిన నేపధ్యంలో మరోసారి మహేష్ తో సినిమా చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో ఉంటుందని కొరటాల చెప్పడంతో అభిమానుల్లో మరింత
ఆసక్తిని కలిగిస్తోంది. ఈ విషయం గురించి కొరటాల మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్
పనులు జరుగుతున్నాయి. శ్రీమంతుడు తరహాలో మెసేజ్ ఇస్తూ, ఎంటర్టైన్మెంట్ గా సాగుతుందని
చెప్పారు. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నట్లు సమాచారం. మహేష్ అభిమానులకు
ఆనందం కలిగించే విషయాలు ఈ సినిమా చాలా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నారు. జనవరిలో
ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates