HomeTelugu Newsవారితో బూట్లు నాకిస్తాం.. జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వారితో బూట్లు నాకిస్తాం.. జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

7 16
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. సంచలన కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ చర్చకు కేంద్ర బిందుగా ఉంటారు. ఈ సారి పోలీసు అధికారులను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశానికి హాజరైన జేసీ దివాకర్ రెడ్డి… టీడీపీ చీఫ్ ముందే సంచలన కామెంట్లు చేశారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వంగివంగి దండాలు పెడుతున్నారు… వాళ్ల సంగతి చూస్తామన్నారు. పోలీసులు ఐదేళ్లే కాదు చాలా కాలం సర్వీసులో ఉంటారు.. వారు ఎక్కడున్నా వదిలేదిలేది లేదని హెచ్చరించారు జేసీ దివాకర్ రెడ్డి… ఇప్పుడు మాపై తప్పుడు కేసులు పెట్టినట్టుగానే… మేం పోలీసులపైనా గంజాయి, సారా కేసులు పెడతామంటూ కామెంట్ చేశారు.

టీడీపీ అధికారం కోల్పోకముందే వైఎస్ జగన్ గురించి చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని గుర్తుచేసిన జేసీ దివాకర్ రెడ్డి… కానీ, చంద్రబాబు వినిపించుకోలేదని.. శాంతి శాంతి అంటూ చంద్రబాబు తమను ముంచాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబులో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తమను వేధించిన అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఒకవేళ సదరు అధికారులు పదవీ విరమణ చేసినా.. వదిలిపెట్టబోమని కామెంట్ చేయడం విదాస్పదంగా మారింది.

.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!