HomeTelugu Big Storiesఎన్టీఆర్‌ చేతుల మీదుగా 'తిమ్మరుసు' ట్రైలర్‌

ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ‘తిమ్మరుసు’ ట్రైలర్‌

Thimmarusu trailer

టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కొంతసేపటి క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

లాయర్ రామచంద్రగా సత్యదేవ్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. కేసును గెలిపించడం కోసం అవసరమైతే తన డబ్బును ఖర్చు చేసే నిజాయతీ పరుడిగా ఆయన పాత్రను చూపించారు. అలా అందరికీ సాయం చేస్తూ, కారు నుంచి బైక్ రేంజ్ కి పడిపోయిన తీరును గురించి చెప్పారు. ఈ కథ అంతా కూడా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. “నీ ముందున్నది ‘వాలి’ అని మరిచిపోకు లాయర్ రామచంద్ర .. ఎదురుగా వస్తే సగం బలం లాగేస్తా” అని క్రిమినల్ అంటే, “నువ్వు సగం బలం లాగే వాలివైతే, దండేసి దండించే రాముడి లాంటివాడిని నేను” అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా అనిపిస్తోంది. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచేదిలానే ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu