HomeTelugu Trendingహీరోగా ఎంట్రీ ఇవ్వనున్న ఎన్టీఆర్‌ బావమరిది..

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న ఎన్టీఆర్‌ బావమరిది..

Ntr wife pranathi brother t

టాలీవుడ్ లో స్టార్ హీరోల ‘బావ’లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.కాగా మరోసారి ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగా ఫ్యామిలీ.. ఘట్టమనేని ఫ్యామిలీ.. నందమూరి కుటుంబాల నుంచి బావలు హీరోలుగా మారి అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ కి సుధీర్ బాబు .. చరణ్ కి కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇవ్వగా.. త్వరలోనే వరుణ్ తేజ్ బావ చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఈ బావమరుదుల లిస్ట్ లోకి కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది చేరుతున్నాడట. ఎన్టీఆర్ నార్నె వారి అల్లుడు అన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ భార్య ప్రణతి ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ నార్నె శ్రీనివాస్ కుమార్తె. ఇప్పుడు నార్నే శ్రీనివాస్ తనయుడు.. ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu