HomeTelugu Trendingఫన్నీగా జ్యోతిక 'జాక్‌పాట్‌' ట్రైలర్‌

ఫన్నీగా జ్యోతిక ‘జాక్‌పాట్‌’ ట్రైలర్‌

4 26హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో కోలీవుడ్‌లో విజయవంతంగా రాణిస్తున్న నటి జ్యోతిక. ఆమె, రేవతి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జాక్‌పాట్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో జ్యోతిక, రేవతి.. పోలీస్‌, డాక్టర్‌ ఇలా వివిధ గెటప్‌లలో కనిపించారు. ‘ఎవరు మీరు.. ఎందుకు నన్నిలా టార్చర్‌ పెడుతున్నారు..’ అని విలన్‌ జ్యోతికను ప్రశ్నిస్తే.. ‘మీకు గుర్తు రావట్లేదా?.. గుర్తు రావట్లేదా?..’ అంటూ చంద్రముఖి స్టైల్‌లో జవాబు చెప్పడం సరదాగా అనిపించింది. ‘ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు..’ అంటూ పేద చిన్నారుల కోసం జ్యోతిక వివిధ డ్రామాలు ఆడుతూ కనిపించారు. వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు జ్యోతిక స్టంట్స్‌ కూడా ఆకట్టుకున్నాయి. ‘ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక బాద్‌షా..’ అంటూ ఆమె విలన్‌ను బెదిరిస్తూ కనపడ్డారు. ఈ చిత్రానికి కల్యాణ్‌ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య సినిమాను నిర్మించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu