జగన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన .. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోతున్నాడు… ఇది నానోటి నుంచి వచ్చిన మాట.. తప్పక జరుగుతుందని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ వచ్చేది మళ్లీ రాక్షస రాజ్యం తేవడానికా…? అని ప్రశ్నించిన పాల్.. వైఎస్ జగన్‌తో చర్చకు నేను సిద్దం.. జగన్ సిద్దమా…? అని సవాల్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబినుంచి ఎలా కాపాడగలరో జగన్ చెప్పాలని డిమాండ్ చేసిన కేఏ పాల్… ఈ ఎన్నికల్లో అవినీతి చేసి గెలవాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తనకు హెలికాఫ్టర్ గుర్తు రాకుండా ఎలక్షన్ కమిషన్‌కు వైఎస్ జగన్ లేఖరాశారని విమర్శించారు పాల్… ఫ్యాన్ కు హెలికాఫ్టర్ కు తేడా తెలియని దుస్ధితిలో ప్రజలు వున్నారా…? అని ప్రశ్నించారు.