చంద్రబాబు ఆ పాపమే అనుభవిస్తున్నారు!


చంద్రబాబు నాయుడిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టుగా కొన్నాడని, ఆ పాపమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. దేవినేని అవినాష్ ఓడిపోయాక పురుగును చూసినట్టుగా చూశారని అన్నారు. చంద్రబాబును నమ్మి అవినాష్ మోసపోయారని అందుకే అవినాష్ వైసీపీలో జాయిన్ అయ్యాడని అన్నారు.

వరదలు వచ్చినపుడు ఇసుక తీయడం కుదరదని, ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు ఇలా మాట్లాడటం తగదని నాని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తున్నట్టు నాని పేర్కొన్నారు. కులం, మతం లేదు అని చెప్పే పవన్ కల్యాణ్ కులాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ కులం ఏంటో పవన్ కు చెప్పాల్సిన అవసరం ఏంటి అని కొడాలి నాని ప్రశ్నించారు. సీఎం జగన్ ను విమర్శించే అర్హత వీళ్లకు ఎక్కడ ఉన్నది అని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీలో సంక్షోభం ఉందని, ముందుగా ఆ సంక్షోభాన్ని నివారించుకోవాలని కొడాలి నాని హితవుపలికారు.

CLICK HERE!! For the aha Latest Updates