HomeTelugu Trendingకాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్‌.. ఫొటో వైరల్‌

కాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్‌.. ఫొటో వైరల్‌

Kajal with fiance and sisteటాలీవుడ్‌ చందమామ కాజల్. అగర్వాల్ ఈ నెల(అక్టోబర్‌) 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొందిమంది బంధువుల సమక్షంలో ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని ప్రకటించింది కాజల్. దీంతో ఆమెకు గౌతమ్‌ కిచ్లూ సోదరి గౌరి కిచ్లూ నాయర్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కాజల్, గౌతమ్‌లతో తాను ఇటీవల దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

ఆమె చేసిన పోస్టును చూసిన కాజల్ కూడా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఈ ఫొటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకుంది. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్‌ ఆ ఫొటోను స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నారు. కాజల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!