జయలలిత పాత్రలో కాజల్‌.?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో… మూడు రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, ఈ బయోపిక్ లో నాలుగో సినిమా కూడా చేరింది. తమిళనాడు తెలుగు యువశక్తి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి జయలలిత జీవితం ఆధారంగా ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు.

జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి, అజయ్ దేవగణ్ సతీమణి కాజోల్ ను సంప్రదించారట. కాజోల్ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని వచ్చిన వెంటనే సినిమాను ప్రకటిస్తారని సమాచారం. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అమ్మ జయలలిత పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.