Homeపొలిటికల్కళ్యాణ్ రామ్.. నేడు ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం

కళ్యాణ్ రామ్.. నేడు ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం

Kalyan Ram.. is a living proof of talent today.

నందమూరి కళ్యాణ్ రామ్… నేడు ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం అయ్యాడు, హీరో అవ్వాలనుకుని హార్డ్ వర్క్ చేసే యూత్ కి నిజమైన ఆదర్శం అయ్యాడు. ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే ఏకైక హీరో.. నందమూరి కళ్యాణ్ రామ్. తెలుగు తెర ఆరాధ్య దైవం సీనియర్ ఎన్టీఆర్ కి స్వయానా మనవడు అయినా.. ఎన్నడూ సీనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకోని సినీ కార్మిక హీరో కళ్యాణ్ రామ్. మొదట్లో హీరోగా గుర్తింపు రాకపోయినా.. తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో కూడా కళ్యాణ్ రామే.

తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకునే హీరోలు అతి తక్కువగా ఉన్న ఈ జనరేషన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి విభిన్నమైన చిత్రాలు అందించే హీరో ఉండటం నేటి ప్రేక్షకుడు చేసుకున్న అదృష్టం. ఇప్పటికే నిర్మాతగా నష్టాల పాలు అయినా, కొత్తదనం కోసం ఎంతదూరం అయినా వెళ్లే నటుడు కళ్యాణ్ రామ్. అభిమన్యుడు సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కి, నేడు రిలీజ్ అయిన అమిగోస్ సినిమాలోని కళ్యాణ్ రామ్ కి ఎంతో వ్యత్యాసం ఉంది. అంత అద్భుతంగా కళ్యాణ్ రామ్ తన నటనను తాను తీర్చిదిద్దుకున్నాడు.

ఇతను హీరో ఏమిటి ? అని విమర్శలు గుప్పించిన వారే.. నేడు మా అభిమాన హీరో నందమూరి కళ్యాణ్ రామే అంటూ ఆరాదిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరుసగా వస్తున్న విజయాల్ని చూసి పొంగిపోకుండా నేటికీ విలక్షణమైన పాత్రల కోసం తాపత్రయ పడటం నందమూరి కళ్యాణ్ రామ్ దినచర్య. ప్రస్తుతం అభిమానులు నందమూరి కళ్యాణ్ రామ్ కి నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. మొత్తానికి అమిగోస్ లో కళ్యాణ్ రామ్ తన నటనతో అబ్బురపరిచాడు. తనతో తానే పోటీ పడి నటించాడు. ఫలితంగా నందమూరి కళ్యాణ్ రామ్ పేరు తెలుగు సమాజం వ్యాప్తంగా మారుమ్రోగుతోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా ? అంటూ టాలీవుడ్‌ సైతం ఆశ్చర్యపోయింది. సినిమాకి సినిమాకి నందమూరి కళ్యాణ్ రామ్ రేంజ్ కూడా అమాంతం పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అమిగోస్ చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ పరిపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాల పరంగా హీరోగా కెరీర్ కొనసాగిస్తూనే.. నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అందుకే.. కళ్యాణ్ రామ్ ఎప్పటికీ ప్రత్యేకమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!