HomeTelugu Trendingకల్యాణి ప్రియదర్శన్ ఆంటోనీ మూవీ ట్రైలర్

కల్యాణి ప్రియదర్శన్ ఆంటోనీ మూవీ ట్రైలర్

Antony movie trailer

అఖిల్ హలో సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం సినిమాలతో పాటు మలయాళంలో బ్రో డాడీ, తల్లుమ‌ల్ల‌, హృద‌యం చిత్రాల‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కల్యాణి పియదర్శన్ సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం ఆంటోని. ఇందులో జోజు జార్జ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ బాక్సింగ్ ప్లేయర్‌గా నటిస్తోంది. జోజు జార్జ్ విలేజ్ డాన్‌గా నటిస్తున్నట్లు తెల‌ుస్తోంది. జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో విడుదల కానుంది.

పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఐన్‌స్టీన్ మీడియా, నెక్స్‌టెల్ స్టూడియోస్, అల్ట్రా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu