కమల్ రెడీ అయిపోయాడు!

 

kamal

 

లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ ‘శభాష్ నాయుడు’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూనే ప్రధాన
పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యన ఆయన ఆఫీస్ కార్యాలయంలో కాలు జారీ పడడంతో
గాయం అయింది. ఇది జరిగి నెల పదిహేను రోజులు దాటింది. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో
మళ్ళీ ఈ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్
ప్రారంభించినట్లు ఆయన ట్వీట్ చేశారు. పేపర్ వర్క్ మొదలుపెట్టానని ఇప్పుడు తన కాళ్ళ
మీద తాను నిలబడగలుగుతున్నానని ట్విటర్ లో పేర్కొన్నారు. తన యాక్సిడెంట్ కు
సంబంధించిన పూర్తి స్టోరీను త్వరలోనే చెబుతానని వెల్లడించారు. మొత్తానికి ఎన్ని ఆటంకాలు
వస్తున్నా.. ఈ సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో కమల్ హాసన్ ఉన్నారు. ఈ సినిమాలో
కమల్ తో పాటు ఆయన కూతురు శృతిహాసన్ కూడా కనిపించనునడం విశేషం.