హైదరాబాద్‌ చేరుకున్న కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రౌనత్‌ హైదరాబాద్ చేరుకుంది. షూటింగ్ నిమిత్తం కంగనా రనౌత్ హైదరాబాద్ వచ్చింది. పది రోజుల పాటు హైదరాబాద్ ఉంటూ..షూటింగ్ లో కంగనా పాల్గొననుంది. అయితే… కంగనా రనౌత్ పర్యటనను గోప్యంగా అధికారులు ఉంచారు. కంగనారనౌత్ ప్రస్తుతం ” వై” కేటగిరి సెక్యూరిటీలో ఉంది. అటు తెలంగాణ అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. పది రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో కంగనా రనౌత్ షూటింగ్ లో పాల్గొననుంది. కాగా.. కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కంగనారనౌత్.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా మారింది.

CLICK HERE!! For the aha Latest Updates