HomeTelugu Trendingయాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోన పాజిటివ్

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోన పాజిటివ్

Arjun daughter aishwarya coదేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ జనాల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రెటీస్ ఈ వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఐశ్వర్య తెలిపారు. ఆమె ప్రస్తుతం చెన్నైలో ప్రముఖ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఐశ్వర్య అర్జున్ రెండు తమిళ సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu