HomeTelugu Trendingటాలీవుడ్‌: సినీ కార్మికుల సమ్మె సైరన్.. షూటింగ్‌లకు దూరం

టాలీవుడ్‌: సినీ కార్మికుల సమ్మె సైరన్.. షూటింగ్‌లకు దూరం

Telugu film industry worker

తెలుగు చిత్ర పరిశ్రమలో… వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

మంగళవారం నాడు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరిపింది. అనంతరం ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘం నాయకులతో చర్చిస్తున్నాం. ప్రతీ మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలి. కానీ నాలుగేళ్లైనా సినీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu