రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిపడ్డా!

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఓ రెండు సినిమాలు చేసింది కానీ అమ్మడుకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అర్జున్. ఇందులో భాగంగా తానే దర్శకనిర్మాతగా మారి ‘కాథలిన్ పోన్ వీధియిల్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. హీరో చందన్, ఐశ్వర్యలపై ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే తండ్రి ఎదుట అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని చెబుతోంది ఐశ్వర్య. ప్రస్తుతం ఆయనొక దర్శకుడు, నేనొక నటిని అంటూ.. మనసుకి సర్ధి చెప్పుకొని నటించానని అంటోంది. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని… కెరీర్ పరంగా ఈ సినిమా తనకు బాగా హెల్ప్ అవుతుందని ఆమె నమ్ముతోంది.