HomeTelugu Trendingకరోనా నుంచి కోలుకున్న హీరో

కరోనా నుంచి కోలుకున్న హీరో

Dhruva sarja prerana test n 1

కరోనా మహమ్మారి సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలటం లేదు. కొందరు కరోనా బారినుంచి కోలుకుని బయటపడుతున్నారు. కొందరేమో ఈ మహమ్మారికి బలైపోతున్నారు. కన్నడ నటుడు ధ్రువ సర్జా, ఆయన సతీమణి ప్రేరణ కరోనాను జయించి బయటపడినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోవిడ్ పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపాడు ధ్రువ. కష్టసమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబం సహా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వారిద్దరికీ వైద్యం చేసిన డాక్టర్. సుర్జిత్ పాల్ సింగ్, అతడి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా ప్రముఖ హీరో అర్జున్ సర్జా మేనల్లుడే ధ్రువ సర్జా. కాగా ఇటీవల అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu