రాహుల్‌ గాంధీతో డేట్‌ చేస్తానంటున్న బాలీవుడ్‌ ప్రముఖ నటి!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్.. రాజకీయా నాయకుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇంకా పెళ్లికాని బ్రహ్మచారులుగానే ఉన్నారు. అయితే, సల్మాన్ ఖాన్ ఎలాగో రంగుల ప్రపంచంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పటికే ఇద్దరు ముగ్గురితో లవ్ ఎఫైర్స్ నడిపాడు, డేటింగులూ గట్రా చేశాడు. అయితే, రాజకీయాల్లో ఎ‌‌ప్పుడూ బిజీగా ఉండే రాహుల్ గాంధీ మాత్రం ఇంకా పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే, తాజాగా రాహుల్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టింది ఓ బాలీవుడ్ బ్యూటీ. ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ బెబో కరీనాకపూర్.

తాజాగా సిమీ గరేవాల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా… పలు ఆసక్తికరమైన విషయాలను వ్యాఖ్యాతతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ మీరు ఎవరితో డేట్‌కు వెళ్లాలనుకుంటున్నారు?’ అంటూ సిమీ అడిగిన ప్రశ్నకు.. రాహుల్‌గాంధీతో అంటూ.. ఆసక్తికరమైన సమాధానం చెప్పింది కరీనా. ‘ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చో, చెప్పకూడదో నాకు తెలియదు. వివాదాస్పదమయ్యే అవకాశం ఉన్నా, చెబుతాను. నేను రాహుల్ గాంధీతో డేటింగ్‌కు వెళ్లాలనుకుంటున్నాను. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మేగజైన్స్‌లో అతని ఫొటోలు చూసినప్పుడల్లా, ఓసారి మాట్లాడితే ఎలా ఉంటుందా? అని అనిపిస్తుంది. నేను పూర్తి సినిమా కుటుంబం నుంచి వచ్చాను. ఆయన పూర్తిగా రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి మా మధ్య జరిగే చర్చ ఆసక్తికరంగా ఉంటుందనుకుంటున్నా’ అని స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పేసింది ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కరీనా.. హీరో సైఫ్ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వారికి ఒక కుమారుడు తైమూర్ కూడా ఉన్నాడు. కరీనా మనసులో మాట పట్ల సైఫ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.