HomeTelugu News'దేవ్‌' ట్రైలర్‌

‘దేవ్‌’ ట్రైలర్‌

10 25హీరో కార్తీ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవ్’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌, పోస్టర్స్‌ ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే హీరో సూర్య విడుదల చేశారు. అడ్వెంచర్స్‌ ఇష్టపడే వ్యక్తి.. ప్రేమలో పడటం.. ఫ్యామిలీ ఎమోషన్స్‌.. వీటన్నంటిలో అతనేం సాధించాడనే కథాంశంతో తెరకెక్కిన దేవ్‌.. ప్రస్తుతం టీజర్‌తో ఆకట్టుకుంటోంది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హారిష్‌ జయరాజ్‌ సంగీతాన్ని సమకూర్చారు. రజత్‌ రవిశంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) ఈ చిత్రం విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu