HomeTelugu Trendingఅన్నదమ్ములు హీరోలుగా శంకర్ మూవీ!

అన్నదమ్ములు హీరోలుగా శంకర్ మూవీ!

Shanker multi starer movie

తమిళంలో హీరోలుగా కొనసాగుతున్నారు సూర్య, కార్తి బ్రదర్స్. తెలుగులోను వీరిద్దరికీ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటికే వీరిద్దరినీ పలు ఇంటర్వ్యూలలో చాలమంది ప్రశ్నించారు. సరైన కథ దొరికితే చేస్తామని చెబుతూ వచ్చారు. అలాంటి ఓ కథను ప్రముఖ డైరెక్టర్ శంకర్ టీమ్ రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

సూర్య, కార్తి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందించేందుకు తగిన కథను శంకర్ రెడీ చేస్తున్నాడని అంటున్నారు.

సూర్య, కార్తి ఇద్దరి ఇమేజ్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్లను డిజైన్ చేస్తున్నాడని చెప్తున్నారు. శంకర్ మూవీ అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మించనున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ మూవీలతో బిజీగా ఉన్నాడు దర్శకుడు శంకర్. ఆ తరువాత చేయబోయే సినిమా ఇదేనని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu