HomeTelugu Newsపవర్‌ స్టార్‌ టైటిల్‌తో 'కార్తి'

పవర్‌ స్టార్‌ టైటిల్‌తో ‘కార్తి’

13 4
మెగాస్టార్‌ చిరంజీవి సినీ ప్రయాణాన్ని మలుపుతిప్పిన చిత్రం ‘ఖైదీ’. ఆ పేరు తమిళ హీరో కార్తికి కూడా బాగా కలిసొచ్చింది. కనకరాజు దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఖైదీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక తమ్ముడు పవన్‌కళ్యాణ్ సినిమా పేరుపైనా కార్తి దృష్టి పెట్టినట్టు సమాచారం.

ప్రస్తుతం జ్యోతిక – కార్తి అక్కా తమ్ముళ్లుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఆ చిత్రానికి తెలుగులో ‘తమ్ముడు’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘తమ్ముడు’ పేరుతో ఇది వరకు పవన్‌కళ్యాణ్ ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. కథ రీత్యా అదే పేరు అయితేనే తన సినిమాకి బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. మరి అన్న పేరు కలిసొచ్చినట్టు, ఆయనకి తమ్ముడు పేరు కూడా కలిసొస్తుందో లేదో చూడాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాను డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu