HomeTelugu NewsNithiin: ఆకట్టుకుంటున్న బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్లు.. ఈసారి హిట్‌ పక్కానా!

Nithiin: ఆకట్టుకుంటున్న బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్లు.. ఈసారి హిట్‌ పక్కానా!

Nithiin upcoming movies are they going to be a hit?

Nithiin: టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ పుట్టిన‌రోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నితిన్‌ తాజాగా నటిస్తున్న మూవీ టీమ్స్‌ కూడా విషెస్‌ చెబుతూ.. కొత్త పోస్టర్లు విడుదల చేస్తున్నారు. నితిన్‌ హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. దానిలో వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వ‌స్తున్న ‘రాబిన్‌హుడ్‌’ ఒకటి. భీష్మ సినిమా త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమా నుండి నితిన్‌ బర్త్‌డే సందర్భంగా.. విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నితిన్ కమాండర్ గెటప్‌లో మాస్ లుక్‌లో అల‌రిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్‌ దొంగగా కనిపించబోతున్నాడు. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Image

అంతేకాక బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ ఓ కీల‌కపాత్రలో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. నితిన్‌కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సంజ‌య్‌ద‌త్‌ను ఈ సినిమాలో తీసుకున్న‌ట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తున్నారు.

కాగా నితిన్‌ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘త‌మ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదలైంది. ఈ పోస్ట‌ర్ గ‌మ‌నిస్తే.. నితిన్ బ‌స్‌పై కూర్చొని సుబ్రమణ్య స్వామి ఆయుధం పట్టుకుని కనిపిస్తున్నాడు.

నితిన్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా.. చాలా క్రియేటివ్‌గా ఈ పోస్ట‌ర్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాంతార, విరూపాక్ష చిత్రాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నాడు.

Image

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ కెరీయర్‌లోనే వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ మూవీగా నిలిచింది. ఈ టైటిల్‌ నితిన్‌కు ప్లస్‌ అవుతుంది అంటున్నారు. దీంతో నితిన్‌ కొత్త సినిమాలపై ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu