కార్తీక్‌ హీరోగా గౌతమ్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం!

‘టిప్పు’, ‘పడేసావె’ చిత్రాలతో మంచి పెర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న హీరో, ప్రముఖ నిర్మాత వైజాగ్‌ రాజు తనయుడు కార్తీక్‌రాజు. ఈ చిత్రాల తర్వాత ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కార్తీక్‌. అక్టోబర్‌ 11న షూటింగ్‌ ప్రారంభమయ్యే ఈ చిత్రం ద్వారా గౌతమ్‌ దర్శకుడుగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం గురించి హీరో కార్తీక్‌రాజు తెలియజేస్తూ.. ”టిప్పు, పడేసావె చిత్రాల తర్వాత ఆరు నెలల గ్యాప్‌ తీసుకొని లుక్‌ పరంగా, ఫిజిక్‌ పరంగా చాలా వర్కవుట్‌ చేశాను. అలాగే యాక్టింగ్‌లో ఎన్నో స్కిల్స్‌ తెలుసుకున్నాను. ఇప్పుడు ఓ రొమాంటిక్‌ కామెడీతో వస్తున్నాను. నా మొదటి రెండు సినిమాల తర్వాత దాదాపు 60, 70 కథలు విన్నాను. అయితే ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయమవుతున్న గౌతమ్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్‌పరంగా ఎంతో వర్క్‌ చేసి డెఫినెట్‌గా సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది అనిపించే అద్భుతమైన కథను నాకు వినిపించాడు. నాకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యే కథ ఇది. డిఫరెంట్‌ నేరేషన్‌తో ఫ్రెష్‌గా వుంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అయి హీరోగా నాకు మంచి బ్రేక్‌ ఇస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాను. అక్టోబర్‌ 11న ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము” అన్నారు.
CLICK HERE!! For the aha Latest Updates