HomeTelugu Newsహీరో కార్తీకేయ-నేహా శెట్టి జంటగా న్యూ ఫిల్మ్

హీరో కార్తీకేయ-నేహా శెట్టి జంటగా న్యూ ఫిల్మ్

Karthikeya 9th film

హీరో కార్తీకేయ తొలిచిత్రం RX100 తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి మంచి విజయాన్ని సాధించడంతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన చిత్రంలో విలన్ పాత్రతో మెప్పించాడు.తాజాగా తన తొమ్మిదో చిత్రం ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమంగా ఘనంగా పూర్తయ్యింది. కార్తీకేయ భార్య లోహిత కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. వంశీ క్లాప్ ఇచ్చి సినిమాను ప్రారంభించారు. కార్తీకేయ సరసన హీరోయిన్ నేహా శెట్టి నటిస్తోంది. క్లాక్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే పోస్టర్ ర్రిలీజ్ చేసారు. పోస్టర్ ని బట్టి కార్తికేయ ఢిపరెంట్ జానర్ లో కనిపించనున్నాడు అని అర్ధం అవ్వుతుంది. అలాగే పోస్టర్ ని పరిశీలిస్తే ఒక కెమెరా లెన్స్ లో పలు మతాలకు సంబంధించిన గుర్తులు, తాళపత్ర గ్రంథాలు, కొన్ని పరిసరాలు, సముద్రపు అలలను చూడవచ్చు. వీటిని బట్టి కార్తీకేయ సరికొత్త సబ్జెక్ట్ తో అభిమానులను అలరిచేందుకు రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్నీ కార్తీకేయ ట్విటర్ వేదికగా స్పందిస్తూ కేరీర్ లోనే ఎప్పుడు చేయని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలిపారు. ఈ స్పెషల్ మూవీ షూటింగ్ ప్రారంభమవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Read more ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మొదటి వారం కలెక్షన్లు..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!