HomeTelugu Newsయంగ్ టైగర్ 35వ బర్త్ డే

యంగ్ టైగర్ 35వ బర్త్ డే

ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం నిన్ననే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీచ్ చేసింది. ఈరోజు మోషన్ పోస్టర్ రూపంలో ఓ క్లాసిక్ లుక్ ను అభిమానులకు అందించారు. ఎన్టీఆర్ ఉబర్ కూల్ లుక్ లో ఉండగా పూజ హెగ్డే ఓ వైపు కూర్చుని ఇద్దరూ మాట్లాడుకునే సన్నివేశం నుంచి పోస్టర్ ను రూపొందించారు.

2 2

త్రివిక్రమ్ స్టైల్లో టైటిల్స్ అచ్చ తెలుగులో ఉన్నాయి. ఎస్. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఆహ్లదకరంగా ఉంది. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని మాస్ లుక్ లో ఉండగా ఇవాళ క్లాస్ లుక్ తో మోషన్ పోస్టర్ కూల్ గా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ నాటికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu