‘కాటమరాయుడు’ నైజాం రైట్స్ తెలిస్తే షాకే!

పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే దాని ప్రీరిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే జోరు కాటమరాయుడు సినిమా విషయంలో కూడా కొంసాగుతోంది. ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ దాదాపు 20 కోట్లకి అమ్ముడిపోయినట్లుగా తెలుస్తోంది. పవన్ సినిమాలకు నైజాం ఏరియాలో ఉన్న క్రేజే వేరు. అందుకే ఆ స్థాయికి రేటు చెల్లించడానికి కూడా బయ్యర్లు వెనుకడుగు వేయలేదు.

మిగిలిన ఏరియాలకు సంబంధించి కూడా రైట్స్ విషయంలో గట్టి పోటీనే ఉన్నట్లు తెలుస్తోంది. సర్ధార్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఆ ఎఫెక్ట్ కాటమరాయుడుపై ఏ మాత్రం పడలేదు అనడానికి ప్రీరిలీజ్ బిజినెస్ ఓ ఉదాహరణ. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకుంటూనే.. మరో వైపున రెండు రోజులకు ఓ పాటను విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.