స్టైలిష్ స్టార్ తో కీర్తి..?

పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సరసన అవకాశాలు పట్టేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కూడా నటించబోతోందని టాక్. నేను శైలజ సినిమా తరువాత కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి. ఈ మధ్యనే టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ నేపధ్యంలో బన్నీ కొత్త సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. బన్నీ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్
ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ చాలా మంది పేర్లు వినిపించాయి.

చివరగా కీర్తి సురేష్ అయితే బావుంటుందని ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెనే ఫైనల్ చేసే అవకాశాలు
కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా వరుసగా క్రేజీ హీరోల పక్కన నటిస్తూ.. ఆమె క్రేజీ హీరోయిన్ గా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.