HomeTelugu Trending'అలిమేలుమంగ'గా కీర్తి సురేష్‌!

‘అలిమేలుమంగ’గా కీర్తి సురేష్‌!

Keerthy Suresh as Alimelu M
గోపీచంద్‌ హీరోగా దర్శకుడు తేజ ఓ ప్రేమ కథను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి వెరైటీగా ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే ఆసక్తికరమైన టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ చిత్రంలో అలిమేలుమంగగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటి వరకు కుర్రకారు ప్రేమను చూపించిన తేజ ఇప్పుడు మెచ్యూర్డ్ జంట మధ్య సాగే ప్రేమను చూపించబోతున్నాడు. ఈ చిత్రంలో అలిమేలుమంగ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. అందుకే ఈ పాత్ర కోసం కీర్తి సురేష్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు యాక్షన్ చిత్రాలలోనే ఎక్కువగా నటించిన గోపీచంద్‌కు ఇది వెరైటీ మూవీ అవుతుంది. పూర్తి ఫ్యామిలీ డ్రామాతో సాగే కథతో దీనిని తేజ రూపొందిస్తున్నారు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సిటీ మార్’ చిత్రంలో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!