HomeTelugu Trendingబాలీవుడ్‌ ఎంట్రీ కోసం ముంబాయిలో ల్యాండైన కీర్తి సురేష్‌

బాలీవుడ్‌ ఎంట్రీ కోసం ముంబాయిలో ల్యాండైన కీర్తి సురేష్‌

keerthy suresh bollywood we

స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఏ పాత్రలోనైనా చాలా ఈజీగా చేస్తుంది. ఇటీవలే ‘దసరా’ సినిమాలో వెన్నెలగా అద్భుతంగా నటించి మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘అక్క’. పీరియాడిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ను బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నది.

ధర్మరాజ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో రాధికా ఆప్టేతో కలిసి నటించనుంది కీర్తి సురేష్‌. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ తాలూకు రిహార్సల్స్‌ ముంబయిలో జరుగుతున్నాయి. సోమవారం ముంబయిలో అడుగుపెట్టిన కీర్తి సురేష్‌ తన తొలి బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

బాలీవుడ్‌లో తన ప్రయాణం ఈ సిరీస్‌తో మొదలుకావడం ఆనందంగా ఉందని, తాను పోషించిన పాత్ర కూడా పూర్తి కొత్తదనంతో ఉంటుందని కీర్తి సురేష్‌ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కీర్తి సురేష్‌ ప్రస్తుతం తమిళంలో సైరన్‌, రఘుతాథ, రివాల్వర్‌ రాణి, కన్నివేడి వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu