HomeTelugu Trending'రొమాంటిక్‌' హీరోయిన్‌ ఆమేనంట!

‘రొమాంటిక్‌’ హీరోయిన్‌ ఆమేనంట!

6 10‘ఆంధ్రాపోరి’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ పూరి, తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాకపోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ ‘రొమాంటిక్‌’ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాతో అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. కేతిక శర్మ అనే మోడల్‌ ఆకాష్‌ సరసన హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు. సోమవారం గోవాలో ప్రారంభమైన షెడ్యూల్‌లో కేతిక పాల్గొనున్నారని నిర్మాత చార్మీ వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu