HomeTelugu Trendingముంబై ముద్దుగుమ్మకు మరో ఛాన్స్

ముంబై ముద్దుగుమ్మకు మరో ఛాన్స్

Tollywood another offinner
టాలీవుడ్‌లో ముంబై ముద్దుగుమ్మలకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎలా నటించడానికైనా అభ్యంతరం చెప్పరని, గ్లామర్ విషయంలో అసలు అడ్డే ఉండదని భావన. అందుకే పారితోషికం ఎక్కువైనా ముంబై భామలకు మన దర్శక నిర్మాతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముంబై ముద్దుగుమ్మ కేతిక శర్మ అందాల ప్రదర్శనలో హద్దులేకుండా నటించిందని వార్తలు. దీంతో ఈ సినిమా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య తాజా చిత్రంలో కేతికను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అంతేకాకుండా మరో సినిమాలోనూ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu