HomeTelugu Trending'కేజీఎఫ్‌ 2' ఫొటోలు, వీడియో లీక్‌

‘కేజీఎఫ్‌ 2’ ఫొటోలు, వీడియో లీక్‌

6 2
కన్నడ హీరో యశ్‌ హీరోగా గా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌ 2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సెట్‌కు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా మైసూర్‌లోని గ్లోబుల్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌లో యశ్‌పై కొన్ని సీన్లు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. ప్రస్తుతం ఇవి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్‌ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ సినిమాని మరింత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నామని ఇటీవల దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అధీర పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ కనిపించనున్నారు.

6a

Recent Articles English

Gallery

Recent Articles Telugu