చరణ్ సినిమాలో చిరు సందడి!

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దృవ’. ఈ సినిమా డిసంబర్ 9 న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ కు ముందు భారీగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ మెగాభిమానులను ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. అంతేకాదు వారికి సంతోషాన్ని కలిగించే విషయం కూడా చెప్పారు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ వ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ఆడియో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే చిరు టీజర్ ఎప్పుడు రాబోతుందో చరణ్ చెప్పేశాడు. డిసంబర్ 9న ‘దృవ’ సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ లోనే ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు చరణ్ వెల్లడించారు. దీంతోపాటు ఈ కార్యక్రమంలో
టీజర్ ఔట్ లుక్ ను రిలీజ్ చేశారు.