HomeTelugu Trendingకోలీవుడ్‌కి వెళ్లబోతున్న కియారా!

కోలీవుడ్‌కి వెళ్లబోతున్న కియారా!

2a

తెలుగులో భరత్‌ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా అద్వానీ కోలీవుడ్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళంలో విజయ్‌ సరసన నటించేందుకు అవకాశం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్‌ బిగిల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కోలీవుడ్‌ ఆఫర్ల కోసం బాలీవుడ్‌ భామలే కాదు పలు భాషలకు చెందిన వారు ఆసక్తి చూపుతారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ భామలు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో నటి కియారాను కోలీవుడ్‌కు దిగుమతి చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. విజయ్‌ హీరోగా పీవీ.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో విజయ్‌ సరసన కియారాను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభించి సంక్రాంతికి సిద్ధం చేయాలని చూస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu