కొన్ని పదాలు ఇబ్బంది పెట్టాయి: అనుపమ పరమేశ్వరన్

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాలో మేరీ పాత్రలో నటించి ఇప్పుడు అదే చిత్రానికి తెలుగులో రీమేక్
గా రాబోతున్న ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ తో కాసిన్ని ముచ్చట్లు..
మీ పాత్ర గురించి..
మలయాళంలో కంటే తెలుగులో నా పాత్ర నిడివి ఎక్కువ ఉంటుంది. మలయాళంలో క్రిస్టియన్
అమ్మాయి మేరీగా కనిపిస్తాను. కానీ తెలుగు ప్రేమమ్ లో హిందూ కుటుంబానికి చెందిన
సుమ అనే అమ్మాయి పాత్రలో నటించాను.
నాగచైతన్యతో కలిసి పని చేయడం..
చైతు మంచి మనిషి. సినిమా మొదలైన కొత్తలో చాలా టెన్షన్ పడ్డాను. చైతు నేను టెన్షన్ పడకుండా కంఫర్టబుల్ గా
ఉండేలా చూసుకున్నారు.
డైరెక్టర్ చందు మొండేటి గురించి..
చందు మొండేటి చాలా సైలెంట్ గా కూల్‌ గా ఉంటారు. ప్రతిదాన్ని చక్కగా హ్యాండిల్‌ చేసేవాడు. సెట్‌లో
అంతా కంఫర్ట్‌గా ఉండేలా చూసేవాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు.
త్రివిక్రమ్ గారితో ర్యాపో..
త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో నటించిన ‘అ ఆ’ చిత్రంతో నాకు మంచి గుర్తింపు లభించింది. ఆయన నాకు
గురువు లాంటివారు. నాకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో.. ఆయనకు బాగా తెలుసు. స్క్రిప్ట్స్
విషయంలో నాకు సజెషన్స్ ఇస్తారు. స్లో గా.. స్టెడీగా వెళ్ళమని చెబుతుంటారు.
ఎలాంటి పాత్రలను ఇష్టపడతారు..
నాకు కథలో, నా పాత్రలో కొత్తదనం ఉండాలి. ఒక పాత్రలో నటించానంటే దాని ద్వారా సంతోషం, తృప్తి
రావాలి. డబ్బు నా ప్రాధాన్యత కాదు. వెర్సటైల్ యాక్టర్ అనిపించుకోవాలి.
డబ్బింగ్ చెప్పారా..
‘అ ఆ’ సినిమాలో త్రివిక్రమ్ గారు నన్నే డబ్బింగ్ చెప్పమన్నారు. అలానే ఈ సినిమాకు చందు గారు
నన్నే డబ్బింగ్ చెప్పమన్నారు. లైన్స్ నేర్చుకొని డబ్బింగ్ చెప్పాను. కానీ కొన్ని పదాలు నన్ను
బాగా ఇబ్బంది పెట్టేవి.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం తెలుగులో ‘శతమానంభవతి’ సినిమాలో నటిస్తున్నాను. అలానే మలయాళంలో ఓ సినిమా
చేస్తున్నాను. తమిళంలో నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates