నయన్ మరీ ఇంత కమర్షియల్ అంటే కష్టం!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నయనతార తన ప్రవర్తనతో తరచూ దర్శకనిర్మాతలను విసిగిస్తూ ఉంటుంది. షూటింగ్ కి సమయానికి రాకపోవడం, ఇచ్చిన కాల్షీట్స్ ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. అసలు విషయంలోకి వస్తే గోపిచంద్, నయనతార, బి.గోపాల్ కాంబినేషన్ లో మూడేళ్ళ క్రితం ఓ సినిమా మొదలైంది.

ఇప్పటివరకు ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. కొన్ని కారణాల వలన షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా నిర్మాతలు ఈసినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి గోపిచంద్ కాల్షీట్స్ ఇస్తున్నా.. నయనతార మాత్రం అంగీకరించడం లేదట.

రెండు పాటల కోసం ఆమెను వారం రోజుల కాల్షీట్స్ అడగగా.. కష్టమని తేల్చి చెప్పేస్తుందట. వారు మరీ ఆమెను ప్లీజ్ చేసుకోవడంతో మూడు రోజుల కాల్షీట్స్ ఇస్తానని దానికి కూడా తగిన పారితోషికం ముందే ఇచ్చేయాలని
కండీషన్స్ పెడుతోందట.

మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. మూడు రోజుల్లో ఒక పాట చిత్రీకరించి మరో పాటను లైట్ తీసుకుంటారేమో చూడాలి. బాబు బంగారం సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. అమ్మగారు డేట్స్ ఇవ్వలేదని ఒక పాటను పక్కన పెట్టేసి సినిమా రిలీజ్ చేశారు. నయన్ మరీ ఇంత కమర్షియల్ అయితే చాలా కష్టం సుమీ!