డాక్యుమెంటరీలో సమంత!

తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత రంగాన్ని అభివృద్ధిపథంలో తీసుకువెళ్లడానికి బ్రాండ్ అంబాసిడర్ గా తనవంతు కృషి చేస్తోన్న నటి సమంత ఇప్పుడు మరో అడుగు ముందు వేస్తున్నారు. తెలంగాణలో చేనేత కార్మికుల బతుకు చిత్రాన్ని ప్రతిబింభించేలా దూలం సత్యనారాయణ అనే ఫిల్మ్ మేకర్ ఓ డాక్యుమెంటరీను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో సమంత కూడా ఓ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మయం దొరికితే.. ప్రచారాల్లో చేనేత వస్త్రాల కు బాగానే ప్రచారాన్ని చేస్తూ.. దేశ విదేశాల్లో కూడా ఈ అమ్మడు వాటి విలువలను తెలియస్తోందట. అంతే కాకుండా ఇంతవరకు ఎవరు చేయని ఓ కొత్త తరహాలో చేనేత కార్మికుల బ్రతుకును వారి కష్టాలను ఒక డాక్యుమెంటరీ ద్వారా ప్రజలకు తెలియజేయనుందని తెలుస్తోంది. డాక్యుమెంటరీ రిలీజైతే కానీ అందులో సమంత పోషించిన పాత్ర ఏంటనే తెలిసే వీలు లేదు.