కొత్త దర్శకుడితో నాగశౌర్య!

ఒకమనసు, జ్యో అచ్యుతానంద చిత్రాలతో నటుడిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు
పరిచయం చేశాడు నాగశౌర్య. వారాహి బ్యానర్ లో చేసిన జ్యో అచ్యుతానంద సినిమా హిట్
కావడంతో ఇదే బ్యానర్ లో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా
ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కానున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ దర్శకుడు ఎవరై
ఉంటారా.. అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా..?
అవసరాల శ్రీనివాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కుమార్ అనే వ్యక్తి ఈ సినిమాను
డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆయన చెప్పిన కథ అటు నాగాశౌర్యకు, ఇటు నిర్మాతలకు కూడా
నచ్చడంతో సినిమా ఓకే అయిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర విషయాల గురించి
త్వరలోనే తెలియనుంది!