కృష్ణంవంశీకి చిరు ఫోన్!

కృష్ణంవంశీకి చిరు ఫోన్!
ప్రస్తుతం ఉన్న పెద్ద దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయనది విభిన్న శైలి. యూత్ తో పాటు అన్ని 
వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను రూపొందిస్తుంటారు. అటువంటి కృష్ణవంశీకి స్వయంగా 
చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇంతకీ కృష్ణవంశీ, చిరంజీవితో 
ఏం మాట్లాడారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరు తన తదుపరి సినిమా 
గురించి కృష్ణవంశీతో మాట్లాడారని కొందరు అంటుంటే.. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న 
‘నక్షత్రం’ సినిమాలో సాయి ధరం తేజ్ ఏ రోల్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఫోన్ చేశారని 
మరికొందరు అంటున్నారు. కానీ ఫోన్ చేసిన చిరంజీవికి కృష్ణవంశీ తన సినిమా లైన్ చెప్పినట్లు 
సమాచారం. చిరుకి బాగా నచ్చడంతో కృష్ణవంశీను అభినందించారట. చిరంజీవి లాంటి వ్యక్తి తనకు 
ఫోన్ చేసి అభినందించడంతో చాలా సంతోశంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
CLICK HERE!! For the aha Latest Updates