
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీశ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న.. ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైంది. ఈ సినిమాతో తెలుగు తెరకి షిర్లే సెటియా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిస్తుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. రాధిక ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించారు.
ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. క్రితం ఏడాది నాగశౌర్య నుంచి వచ్చిన ‘లక్ష్య’ .. ‘వరుడు కావలెను’ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ ఏడాదిలో నాగశౌర్య నుంచి వస్తున్న ఫస్టు మూవీ ఇదే. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు.














