HomeTelugu Trendingసూర్య సినిమాకు భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్న కృతి శెట్టి

సూర్య సినిమాకు భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్న కృతి శెట్టి

Krithi shetty demands huge

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి . ఈ అమ్మడుకి సౌత్ లో భారీగా డిమాండ్ పెరిగిపోయింది. మేకర్స్ రెమ్యూనరేషన్ గా ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఈ బ్యూటీ కూడా ఇదే అవకాశంగా తీసుకుని రెమ్యూనరేషన్ ను పెంచేస్తోంది. ఆమె చేతిలో అర డజనుకు పైగా తెలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఈ యంగ్ బ్యూటీ కూడా ఇప్పటికే ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ని వసుల్‌ చేస్తుదంట.

ఇక ఇటీవలే సూర్య, బాల క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు కృతి పారితోషికాన్ని మరింత పెంచేసిందట. అదే ఇప్పుడు సౌత్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా కోటిన్నర అడిగిందట. నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కు వెంటనే ఓకే చెప్పేశారట. కాగా 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సూర్య, బాలా కాంబో రిపీట్ కాబోతోంది. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పేరు పెట్టని ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి శెట్టి ఇప్పుడు ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన మరో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

అల్లు అర్జున్‌, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!

Recent Articles English

Gallery

Recent Articles Telugu