22 మిలియన్ల ఫాలోవర్స్ తో కృతి సనన్

బాలీవుడ్ హీరోయిన్‌ కృతి సనన్ ఇంస్టాగ్రామ్ లో దూసుకుపోతున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే ఈ హీరోయిన్ ను ఇంస్టాగ్రామ్‌లో 22 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్తూ బీజ్ ఒడ్డున ఇసుకపై 22 అని రాసి, దాని మధ్యలో కృతి బ్లాక్ కలర్ బికినీలో ఫోజులు ఇచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో స్టార్స్ కు ఫాలోవర్స్ ఉంటారన్నది సహజం. సినిమాలున్నా లేకున్నా.. సోషల్ మీడియా లో మాత్రం వీళ్ళు యాక్టివ్ గా ఉంటారు. దీనిని పక్కన పెడితే.. కృతి సనన్ తెలుగులో మహేష్ బాబు 1 నేనొక్కడినే చేసింది. థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ అది పెద్దగా విజయం సాధించలేదు. తరువాత నాగచైతన్యతో దోచేయ్ చేసినా.. టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకోలేకపోయింది. బాలీవుడ్ లో మాత్రం వరస ఆఫర్లతో దూసుకుపోతున్నది.