తనుశ్రీ పై కేసు నమోదు

బాలీవుడ్‌ ప్రముఖులు నానా పటేకర్‌, వివేక్‌ అగ్నిహోత్రిలపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాపై కేసు నమోదైంది. ఇప్పటికే నానా పటేకర్, వివేక్‌ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపగా.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) కార్యకర్త సుమంత్‌ దాస్‌ ఫిర్యాదుతో బీడ్‌ జిల్లాలోని కైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనుశ్రీ పై కేసు నమోదైంది. ఎంఎన్‌ఎస్‌ తనుశ్రీ అసత్య ఆరోపణలు చేశారని దాస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తద్వారా రాజ్‌థాకరే, ఎంఎన్‌ఎస్‌ పరువుకు ఆమె భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. కాగా, నానా విషయంలో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు తనూశ్రీ దత్తను వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిలపై కేసులు ఫైల్ అయ్యాయి.