HomeTelugu Trendingనిర్మాతగా మారిన మరో బాలీవుడ్‌ బ్యూటీ

నిర్మాతగా మారిన మరో బాలీవుడ్‌ బ్యూటీ

Kriti Sanon turned producer
ఈ రోజుల్లో హీరో, హీరోయిన్‌లు వ్యాపార రంగంలోనూ రణిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు హీరోయిన్‌లు నిర్మాతలుగా మారారు. ఈ క్రమంలో అనుష్క శర్మ, కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు నిర్మాతలుగా మారారు. తాజాగా కృతి సనన్ నిర్మాతగా మారింది. ఓవైపు హీరోయిన్‌గా కొనసాగుతూనే నిర్మాతగానూ మారింది. తన చెల్లి నుపూర్ సనన్ తో కలిసి ‘బ్లూ బటర్‌‌ ఫ్లై ఫిల్మ్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రకటించింది. ఈ ప్రొడక్షన్ హౌస్‌ నుంచి మొదటి ప్రాజెక్ట్‌గా ‘దో పట్టి’ అనే సినిమా తెరకెక్కబోతోంది. నెట్‌ ఫ్లిక్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం ఓ మిస్టరీ థ్రిల్లర్.

ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గానూ నటిస్తోంది. సీనియర్ నటి కాజోల్‌ మరో కీలకపాత్రను పోషిస్తోంది. నిర్మాణ సంస్థను ప్రారంభించాలని తొమిదేళ్లుగా అనుకుంటున్నానని కృతి చెప్పింది. ఎట్టకేలకు తన కలలను సాకారం చేసుకుంటున్నానని తెలిపింది. కాగా ఇటీవల వచ్చిన పాన్‌ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌’లో సీతగా నటించింది కృతి సనన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!