
Kuberaa Movie Budget:
ఈ సమ్మర్‌లో రానున్న భారీ సినిమాల్లో Kuberaa టాప్ లిస్టులో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది కమ్ముల కెరీర్‌లోనే కాదు, ధనుష్‌కు కూడా ఇప్పటి వరకు ఉన్న సినిమాల్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కావడం విశేషం.
తెలుగు సినిమా అయినప్పటికీ, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించడం విశేషమే. ఈ సినిమా బడ్జెట్ ఎలా పెరిగిందంటే, కేవలం పారితోషికాలకే దాదాపు ₹60 కోట్లు ఖర్చయినట్టు సమాచారం.
ధనుష్‌కు ₹30 కోట్లు, నాగార్జునకు కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అయిన ₹14 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. కమ్ముల ప్రత్యేకంగా నాగార్జునను ఈ పాత్రకి కోరడంతో, నిర్మాతలు ఆ కోట్‌కి ఓకే చెప్పారు. హీరోయిన్‌గా రష్మిక మందన్నా, సంగీతానికి దేవి శ్రీ ప్రసాద్ వంటి క్రేజీ కాంబినేషన్ ఉండటంతో ఖర్చు మరింత పెరిగింది.
ఇంకా ఈ సినిమా బ్యాంకాక్, ముంబయిలో భారీగా షూట్ చేయబడింది. ఎక్కువ కాలం పాటు షూటింగ్ జరగడంతో, ప్రొడక్షన్ ఖర్చులు, వడ్డీ వ్యయాలు కలిసి మొత్తం బడ్జెట్ ₹130 కోట్ల దాకా చేరిపోయిందట.
అయితే ఈ పెద్ద బడ్జెట్‌ని రికవర్ చేసుకోవడం అంత కష్టమేమీ కాదనిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ మరియు హిందీ హక్కుల ద్వారా దాదాపు ₹90 కోట్లు వచ్చాయని సమాచారం. తమిళ వెర్షన్, తెలుగు థియేట్రికల్ హక్కులు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇవి కూడా అమ్ముడైపోతే, Kuberaa సేఫ్ జోన్‌లోకి వచ్చేస్తుంది.
బిగ్ బడ్జెట్‌తో, బిగ్ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ALSO READ: సడన్ గా Allu Arjun ముంబై ఎందుకు వెళ్లారంటే













